Monday, April 29, 2024

ఫేస్ బుక్ పరిచయం…. వాట్సాప్ న్యూడ్ వీడియో కాల్స్!! మొత్తం నమ్మేశాడు

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫిర్యాదు నమోదు అవుతూనే ఉంది. తాజాగా ఫేస్ బుక్ లో పరిచయం…వాట్సాప్ వీడియో కాల్స్ వరకు వచ్చింది. ఆ తరువాత న్యూడ్ వీడియో కాల్స్ వరకు వెళ్లారు. ఆ వీడియోలను స్క్రీన్ రికార్డు ద్వారా సేవ్ చేసి 10 లక్షల వరకు కాజేశారు సైబర్ మోసగాళ్ళు. వివరాల్లోకి వెళితే తార్నాక కు చెందిన ఈవెంట్ మేనేజర్ కు కొన్నేళ్ళ క్రితం ఓ యువతి పేరుతో ఫేస్ బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇద్దరూ ఫ్రెండ్ గా మారిపోయారు. కొన్నాళ్ళు చాటింగ్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత మెల్లగా చాటింగ్ మొదలుపెట్టారు. ఒకరి నెంబర్లు ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత నగ్న, అర్థనగ్న వీడియోలను సైబర్ నేరగాళ్ల ప్రత్యేక యాప్ ద్వారా ఫోన్ లో ఉంచి మేనేజర్ కు ప్లే చేసి చూపారు. దీంతో మేనేజర్ కూడా ఆ యువతి నగ్నంగా మాట్లాడుతుందని నమ్మేశాడు.

ఒకటి రెండుసార్లు అలానే చూసిన తర్వాత ఆ దృశ్యాలను స్క్రీన్ రికార్డ్ యాప్ ద్వారా రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోలను యూ ట్యూబ్ ఛానెల్ లో ఉంచిన లింకుల్ని బాధితుడికి పంపించారు. బట్టలు లేకుండా ఉన్న బాధితులు ఆ వీడియోని చూసి షాక్ కి గురి అయ్యాడు. 10 లక్షల రూపాయలు చెల్లించాలని లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బాధితుడికి బెదిరించారు. వాళ్ళు అడిగిన మొత్తం సొమ్ము బదిలీ చేశారు. ఆ తర్వాత మరికొంత అమౌంట్ కావాలని వేధింపులు మొదలుపెట్టారు. దీంతో బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement