Wednesday, May 8, 2024

హాలీవుడ్ అరంగేట్రం కోసం వస్తోందా? ‘మళ్లీ కొత్తగా వచ్చినట్లు’ అనిపిస్తుంది

గత నెలలో రణబీర్ కపూర్‌తో వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి అలియా భట్, తన హాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్ కోసం ప‌య‌న‌మైంది. ఈ నటి హాలీవుడ్‌లోని ‘వండర్ వుమన్’ స్టార్ గాల్ గడోట్ ‘బెల్ ఫాస్ట్’ స్టార్ జామీ డోర్నన్ వంటి ప్రముఖులతో పాటు నటించనుంది. నెట్‌ఫ్లిక్స్ కోసం స్పై థ్రిల్లర్‌గా బిల్ చేయబడిన ‘హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను గ్రెగ్ రుకా, అల్లిసన్ ష్రోడర్ రాశారు. ఈ సినిమాలో రాచెల్ స్టోన్ (గాల్ గాడోట్ పోషించినది) అనే ఇంటెలిజెన్స్ కార్యకర్త చుట్టూ తిరుగుతుందని, తన శక్తివంతమైన, ప్రపంచ, శాంతి పరిరక్షక సంస్థ, దాని అత్యంత విలువైన.. ప్రమాదకరమైన ఆస్తిని పోగొట్టుకున్న ఏకైక మహిళ చుట్టూ తిరుగుతుందని చిత్రం యొక్క అధికారిక లాగ్‌లైన్ చెబుతుంది.
కాగా.. ఫ్లైట్ లో తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ భామా. ఆమె క్యాప్షన్‌లో ఇలా రాసింది,”And off I go to shoot my first ever Hollywood film!!!! Feel like a newcomer all over again – sooooo nervous!!!! Wish me luckkkkkkk (sic).”

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement