Saturday, May 18, 2024

బిఏ రాజుకు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

సినీ జర్నలిస్ట్ ప్రముఖ నిర్మాత బిఏ రాజు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. బిఏ రాజు వయస్సు 61 సంవత్సరాలు. అయితే బిఏ రాజు ఓవైపు నిర్మాతగా వ్యవహరిస్తునే…సూపర్ హిట్ ఫిలిం పత్రికను కూడా స్థాపించారు. ఇక బిఏ రాజు భార్య జయ రెండేళ్ల క్రితం చనిపోయారు. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు. అరుణ్ కుమార్, శివ కుమార్. అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన విఎఫ్ ఎక్స్ చేస్తూ ఉంటారు. మరో కుమారుడు శివ కుమార్ ప్రస్తుతం 22 అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, ప్రేమికుడు, మంగమ్మగారి మనవడు, లవ్లీ ,వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు బిఏ రాజు. రాజు మృతి పట్ల మహేష్ బాబు, ఎన్టీఆర్ కొరటాల, విశాల్, నందమూరి కళ్యాణ్ రామ్… వంటి స్టార్స్ సంతాపం తెలుపుతున్నారు..

https://twitter.com/sivakoratala/status/1395921998040031234?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement