Sunday, May 5, 2024

స్మార్ట్ గా ఆలోచించండి.. చోరీలకు చెక్ పెట్టండి: సీపీ రంగనాథ్

స్మార్ట్ ఆలోచన విధానంతో చోరీలను నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత చోరీలకు సంబంధించిన పెండింగ్ కేసులపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు సంవత్సరాల కాలంలో నమోదైన చోరీ కేసులు, ఆయా కేసుల్లోని నిందితుల అరెస్టు స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు, కేసుల పెండింగు గల కారణాలపై జోన్ల వారిగా ఆరా తీసారు.

ముఖ్యంగా ద్విచక్రవాహనాల చోరీలు, ఇండ్లల్లో చోరీలు, దోపిడీలు, సాధరణ దొంగతనాల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చోరీల నియంత్రణపై పలు సూచనలు చేస్తూ ద్విచక్ర వాహన చోరీలపై అధికారులు అశ్రద్ధ వహించవద్దని, కొద్ది కాలంగా ట్రైసిటీ ప్రధాన ప్రదేశాల్లో ద్విచక్ర వాహన చోరీలు అధికంగా వున్నాయని అన్నారు. ఈ తరహా చోరీల కట్టడి చేయిటకు అధికారులు, గతంలో చోరీలకు పాల్పడిన ద్విచక్ర వాహనదొంగల సమాచారాన్ని సేకరించాలన్నారు.

- Advertisement -

చోరీ వాహనాలు కొనుగోలు చేసే వ్యక్తులపై నిఘా వుంచాలని, చోరీ నియంత్రణ కోరకు ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్ తో పాటు, వాహన తనీఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా వాహన తనీఖీ పకడ్బందిగా నిర్వహించాల్సి వుంటుందని, ఇందుకోసం తనీఖీ చేసే అధికారులు సమయాన్ని వెచ్చించాల్సి వుంటుందని. గతంలో చోరీలకు పాల్పడిన నిందితుల సమాచారం సేకరించడం కోసం, వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీసేందుకుగాను ఏసిపి రమేష్ జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో క్రైమ్స్ డిసిపి మురళీధర్, ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్, సెంట్రల్ జోన్ డిసిపి, యం.ఏ.బారీ, వెస్ట్ జోన్ డిసిపి సీతారాంతో పాటు ఏసిపిలు, ఇన్సెస్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement