Saturday, May 4, 2024

రైతుబంధు నిధులు మంజూరు చేయాల‌ని – క‌లెక్ట‌ర్ కి విన‌తిప్ర‌తం

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు మంజూరు చేసి ..రైతు ఖాతాలో జమ చేయలంటూ వరంగల్ కలెక్టర్ కి వినతిపత్రం సమ‌ర్పించారు జిల్లా కాంగ్రెస్ నాయకులు…టిపిసిసి ఆదేశాలాల మేరకు హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బందు నిధులు మంజూరు చేసి రైతు ఖాతాలో జమచేయలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో తొలకరి జల్లులు కురిసి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయింది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ లో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం కింద ఇంకా నిధులు రైతుల ఖాతాలోకి రాలేదు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతు బంధు సాయం సకాలంలో అందకపోవడంతో జిల్లాలోని రైతాంగం ప్రైవేటు అప్పులపైనే భారం వేసి ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రైతు బంధు సాయం అందకపోవడంతో దళారులు, వివిధ సంస్థల వ్యాపారులు, ముఖ్యంగా ఫెర్టిలైజర్‌, పెస్టిసైడ్‌, సీడ్‌ వ్యాపారులు రైతాంగాన్ని మచ్చిక చేసుకొని కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అప్పుగా ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారికి వచ్చే రేట్లలో రెండింతలకు అమ్మకంతో పాటు వాటికి వడ్డీ కలిపి వచ్చే ఏడాది అనగా పత్తి లేదా వరి చేతికొచ్చాక తమకే చెప్పిన ధరలకే విక్రయాలు జరపాలన్న ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో రైతులు పండించిన పంటలు దళారికి, వ్యాపారులకు అమ్మితే రైతులకు మిగిలేది ఏమి ఉండదని తెలుస్తోంది.
రైతుల పెట్టుబడి కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ వడ్డీలతో రైతులు నష్టపోతారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏటా రైతాంగానికి ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందజేయాలని జిల్లా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బంధు సాయం రిలీజ్‌ చేయాలని హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పార్లమెంట్ గా పోటి చేసిన అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి కార్యదర్శి మహమ్మద్ ఆయుబ్, బొజ్జ సమ్మయ్య యాదవ్, జిల్లా కిస్సాన్ కాంగ్రెస్ అద్యక్షులు బొల్లేపల్లి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement