Saturday, May 4, 2024

ప‌ల్లె ప్ర‌గ‌తి హామీలు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టండి – మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు , ఆయా శాఖ‌ల‌ ఉన్న‌తాధికారుల‌తో హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో స‌మావేశ‌మ‌య్యారు. ఇటీవ‌లి ప‌ల్లె ప్ర‌గ‌తితోపాటు, ఆయా శాఖ‌ల్లో నిర్వ‌హిస్తున్న ప‌లు ప‌నుల పురోగ‌తిపై మంత్రి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ఆయా ప‌నుల‌కు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ప‌ల్లె ప్ర‌గ‌తి హామీలు వెంట‌నే చేప‌ట్టాలి..కొత్త సిసి రోడ్లు, గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణాలు మొద‌లు పెట్టండి..స్త్రీ నిధి రుణాల ద్వారా ఇంటింటికీ సోలార్ ప్రాజెక్టు..జిల్లాకు వెయ్యి మంది మ‌హిళా ల‌బ్ధిదారులను ఎంపిక చేయాలి..ప్ర‌యోగాత్మ‌కంగా మ‌హిళా గ్రూపుల‌కు కుట్టు శిక్ష‌ణ‌..డ్వాక్రా గ్రూపుల ఉత్ప‌త్తుల‌ను ఫ్లిక్ కార్ట్ తో అమ్మ‌కానికి ఒప్పందం..స్త్రీ నిధి వేత‌న పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాలి..ఈ స‌మీక్ష స‌మావేశంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ హ‌న్మంత‌రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, పంచాయ‌తీరాజ్ ఇఎన్‌సి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement