Friday, April 26, 2024

ఆస్ప‌త్రుల్లో నాణ్య‌మైన ఆహారం అందించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (వంద పడకల ఆసుపత్రి)ని గురువారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలోని ప్రతి వార్డులో తిరిగి వివరాలు డీసీహెచ్ సంజీవయ్య, డీఎంహెచ్ వో శ్రీరామ్ లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో విద్యుత్ సమస్య పరిష్కారమైందా అని అడిగి తెలుసుకున్నారు. జనరేటర్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా జనరల్ వార్డులో బెడ్స్ పై బెడ్ షీట్స్ లేకపోవడంతో వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా బాలింతలతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందిస్తున్న సౌకర్యాలు, భోజనం వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందించే భోజనం మెనూను వార్డుల్లో డిస్ప్లే చేయాలని నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం బ్లడ్ బ్యాంకును సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. బ్లడ్ యూనిట్లలో నిల్వలు పెంచుకునేందుకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువతను, కళాశాల విద్యార్థులు, బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారి వెంట ఆర్ ఎమ్ ఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వైద్యులు సిబ్బంది వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement