Sunday, December 8, 2024

కలకలం రేపిన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అహ్మద్ బాషా శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల అతడిని భూపాలపల్లి పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీతో కలత చెందిన అహ్మద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కాగా తోటి సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అహ్మద్ గతంలో ములుగు జిల్లా పస్రలో పనిచేసి అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు వచ్చాడని, ఆ వెంటనే భూపాలపల్లికి బదిలీ చేయడంతో వృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నానే ఆవేదనతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అతడి బంధువులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement