Tuesday, March 26, 2024

ఇదెక్కడి న్యాయం​: సాఫ్ట్​ సిగ్నల్ పై కోహ్లీ అసహనం

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పదరీతిలో ఔట్‌ అయ్యాడు. రిప్లైలో బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా ఫీల్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి సూర్య బలి కావాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దీనిపై టీమిండియా కెప్టెన్ అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ తీసుకున్న సాఫ్ట్ సిగ్నల్ నిర్ణయాన్ని తోసిపుచ్చాలంటే కచ్చితమైన ఆధారాలు అవసరమన్న వ్యాఖ్యలతో విభేదించాడు. ఇలాంటి సంక్లిష్ట నిర్ణయాలు మంచిదికాదని, ఆ నిబంధనలను మరింత సులభతరం చేయాలని అన్నాడు. దాని వల్ల కీలకమైన మ్యాచ్ లలో జట్లకు నష్టం కలగకుండా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక అంపైర్ కాల్ లాగానే అంపైర్లకూ ఐ డోంట్ నో కాల్ ఎందుకు ఉండకూడదు? ఆటలో నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇలాంటి నిర్ణయాలే ఆట గతిని మార్చేస్తాయని, ఈరోజంటే తాము గెలిచామని, రేపు వేరే జట్టుకూ ఇలాగే జరిగి ఓడిపోతే పరిస్థితి ఏంటని కోహ్లీ ప్రశ్నించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement