Tuesday, April 30, 2024

గూడూరులో నకిలీ పోలీసుల హల్ చల్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గూడూరు నుండి నెక్కొండ నర్సంపేట వెళ్లే ప్రధాన రహదారిలోని గుండెన్గా గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం మత్తులో పోలీసులమంటూ హల్చల్ చేశారు. మెయిన్ రోడ్డుపై నుండి వచ్చిపోయే వాహనదారులను ఆపి జబర్దస్తుగా ఫైన్ కట్టమంటూ అక్రమంగా డబ్బులు వసూళ్ళు చేస్తున్నారు. దుండగుల అక్రమ వసూళ్ల దందాపై స్పందించిన స్థానికులు గట్టిగా మందలించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులుగా నమ్మించేందుకు ఖాకీ రెయిన్ కోట్ ధరించి, నకిలీ పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. వారిని గుర్తించి పోలీసులకు సమాచారమందించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement