Tuesday, May 21, 2024

TS: చివ‌రకు మిగిలింది వీరే… లోక్ స‌భ బ‌రిలో 525 మంది..

హైద‌రాబాద్ -నాల్గో విడతలో భాగంగా 17 లోక్ సభ సీట్లలో పోటీ చేసే అభ్యర్దులు ఎవరనేది తేలిపోయింది. సికింద్రాబాద్ నుంచి అత్యధికంగా 45మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి సహా వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్దులు కలిపి 893మంది నామినేషన్లు దాఖలు చేసారు. వాటిలో 625 మంది అభ్యర్దుల నామినేషన్లకు ఈసీ ఓకే చేసింది. ఇక నిన్న దాదాపు 100మంది అభ్యర్దులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లలో 525మంది బరిలో ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

ఇక సికింద్రాబాద్ నుంచి అత్యధికంగా.. 45మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత మెదక్ నుంచి 44మంది.. చేవెళ్ల నుంచి 43మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి నుంచి 42మంది పోటీలో ఉన్నారు. అటు కరీంనగర్ నుంచి 28.. నిజామాబాద్ నుంచి 29.. మహబూబ్ నగర్ నుంచి 31, నాగర్ కర్నూల్ నుంచి 19.. నల్గొండ నుంచి 22.. భువనగిరి నుంచి.. 39.. వరంగల్.. 40.. మహబూబాబాద్ నుంచి 23 మంది.. ఖమ్మం నుంచి 35 మంది.. హైదరాబాద్ లోక్ సభ సీటు నుంచి 30.. మల్కాజ్‌గిరి.. 22.. మెదక్.. జహీరాబాద్ నుంచి 19.. ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 12 మంది బరిలో ఉన్నారు. 17 లోక్ సభ సీట్లలో ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement