Saturday, April 27, 2024

ఆ బిల్లు పార్లమెంట్‌లోకి వస్తే దేశమంతా అంధకారం చేస్తాం

కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భూపాలపల్లిలోని కేటీపీపీ ముందు టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని అసోసియేషన్‌లు, ట్రేడ్ యూనియన్‌లు నిరసన చేపట్టాయి. సోమవారం ఉదయం దాదాపు మూడు గంటల పాటు కాకతీయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లు వల్ల సామాన్య ప్రజలకు, రైతులకు తీవ్రనష్టం కలుగుతుందని.. ఈ బిల్లు వల్ల పారిశ్రామికవేత్తలు లాభపడే అవకాశాలు ఉన్నాయని వారు ఆరోపించారు.

విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్‌లోకి వచ్చిన రోజు అవసరమైతే దేశమంతా అంధకారం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఈ బిల్లు వల్ల సామాన్యుడు, ధనవంతుడు ఒకేవిధమైన బిల్లు చెల్లించే విధంగా ఉంటుందన్నారు. ఈ బిల్లు విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించి పార్లమెంట్‌లోకి రాకుండా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇది సరైన చర్య కాదని కేటీపీపీ ఉద్యోగులు విమర్శలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణం

Advertisement

తాజా వార్తలు

Advertisement