Thursday, March 28, 2024

దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణం

దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. నిందితులైన మాలిక్ సోదరులు ఎన్ఐఏ అధికారులనే బురిడీ కొట్టించారు. విచారణలో ఈ తీవ్రవాదులు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వాడినట్లు తేలింది. వారి బ్యాగుల్లో జీపీఎస్, బ్లూటూత్, వాకీటాకీ పరికరాలున్నట్లు వెల్లడైంది. 15 రోజులపాటు తమతో వాళ్లు ఈ బ్యాగులు తీసుకెళ్లారు. తాజాగా వాటిని తనిఖీ చేయడంతో ఈ డివైజెస్ బయటపడ్డాయి. వీటిద్వారా ఎన్ఐఏ అధికారుల కదలికలను చేరవేసినట్లు సమాచారం.

మరోవైపు దర్బంగా పేలుళ్ల కేసు విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కుట్ర వెనుక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. లష్కరే ముఖ్యనేత ఇక్భాల్ ఆదేశాలతోనే భారత్‌లో భారీ పేలుడుకు నిందితులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. కాగా ద‌ర్బంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగియడంతో ఈనెల 23 వ‌ర‌కు రిమాండ్ విధించారు.

ఈ వార్త కూడా చదవండి: రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ ను ధ్వంసం చేసిన సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement