Monday, April 29, 2024

అధైర్య పడకండి అండగా ఉంటాం…నన్నపునేని నరేందర్

అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరద బాధితులకు భరోసానిచ్చారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని హంటర్ రోడ్డులో భారీగా నీరు నిలవడంతో నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేటి ఉదయం హంటర్ రోడ్ లోని సంతోషిమాత కాలనీ పరిసరాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను కార్పొరేటర్ గందే కల్పన నవీన్, అధికారులతో సమీక్షించారు.


పలువురు వరద ముంపు బాధితులతో మాట్లాడి అధైర్య పడొద్దని అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు
పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో పాటు ఇండ్లలో చిక్కుకున్న వారికి సైతం భోజనం ఏర్పాట్లపై ఆరా తీసి నిన్నటిలాగా నేడు కూడా అందరికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement