Wednesday, May 15, 2024

Karnatak : బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి క‌న్న‌మూత… ప్రధాని సంతాపం

కర్ణాటకలోని చామరాజనగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -

శ్రీనివాస ప్రసాద్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చామరాజనగర్‌ నుంచి శ్రీనివాస ప్రసాద్‌ ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. మైసూర్‌ జిల్లాలోని నంజన్‌గుడ్‌ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్లు గత నెల 18నే ప్రకటించారు. 1976లో జనతా పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1979లో కాంగ్రెస్‌లో చేరారు. భాజపాలో చేరడానికి ముందు కొన్నాళ్లు జేడీఎస్‌, జేడీయూ, సమతా పార్టీలోనూ పనిచేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న 1999-2004 సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో తిరిగి భాజపాలో చేరారు. 2017లో నంజన్‌గుడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2019లో చామరాజనగర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement