Thursday, May 2, 2024

క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ కు ఎయిర్ అసియా షాక్… ఎయిర్ పోర్ట్ లో వదిలేసి టేకాఫ్..

బెంగళూరు: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా సిబ్బంది ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్ ఎయిర్‌పోర్టు లాన్‌లో ఎదురుచూస్తున్నా ఆయనను వదిలేసి విమానాన్ని టేకాఫ్‌ చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ హైదరాబాద్‌కు వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన లగేజీని కూడా ఎయిర్‌ఏషియా విమానంలో ఎక్కించారు. అయితే వీఐపీ లాన్‌ నుంచి గహ్లోత్‌ టర్మినల్‌ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌కు టేకాఫ్‌ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌ టర్మినల్‌ వద్ద బోర్డింగ్‌ గేట్‌కు చేరుకోవడం ఆలస్యం అవడం వల్లే విమానం వెళ్లిపోయిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. ఎయిర్‌ఏషియా సిబ్బంది నిర్వాకంపై గవర్నర్‌ ప్రొటోకాల్‌ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఘటన కారణంగా గహ్లోత్‌ 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

- Advertisement -

ఎయిర్‌ఏషియా క్షమాపణలు
మరోవైపు, ఘటనపై ఎయిర్‌ఏషియా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ”గవర్నర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేపట్టాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండటానికే మేం ప్రాధాన్యమిస్తాం. గవర్నర్‌ కార్యాలయంతో మా సంబంధాలను మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఎయిర్‌ఏషియా తమ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement