Thursday, May 16, 2024

Viveka – ఆ కేసులో ఆధారాలున్నాయి.. సీబీఐ దగ్గర సాక్షాలున్నాయి – షర్మిల


ఆంధ్రప్రభ స్మార్ట్, కడప ప్రతినిధి : రాముడికి లక్ష్మణుడు ఎలాగో తన తండ్రి వైఎస్ఆర్‌కు వివేకా అలా ఉండేవారని , లక్ష్మణుడిలాంటి తన చిన్నాన్నను దారుణంగా చంపేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కడప జిల్లాలో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్ టార్గెట్గా విమర్శలు దంచుతున్నారు. కడపజిల్లా పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వివేకానంద చనిపోయి 5 ఏళ్లు గడిచాయి, ఇంత వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. .‘తన చిన్నాన్నను గొడ్డలితో ఏడు సార్లు క్రూరంగా హత్య చేశారని, ఎవరు చంపారో అందరికీ తెలుసని షర్మిలా అన్నారు.

సీబీఐ వ‌ద్ద ఆధారాలున్నాయి..

ఈ హత్యకు సంబంధించి సీబీఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని. అవినాష్ రెడ్డి నిందితుడనే సాక్ష్యాలు ఉన్నాయని ఆమె అన్నారు. వైఎస్ఆర్ తమ్ముడు చనిపోయాడు, హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారని, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూలులో కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారని షర్మిల ఆరోపించారు. అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి అడ్డు పడ్డాడని, హంతకులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ‘ హత్య జరిగిన సమయంలో సీబీఐ విచారణ కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ వద్దన్నారు. సీబీఐ విచారణ అంటే జగన్ ఎందుకు బయపడుతున్నారు, అని షర్మిల ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement