Wednesday, May 8, 2024

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డోర్నకల్ – రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డోర్నకల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. మండల వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలి అన్నారు.భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్ వినియోగించుకోవాలని తెలియజేశారు.చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అనుమతులు లేకుండా సభలు,సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న మాట్లాడుతూ కరోనా రాష్ట్రంలో మళ్లీ అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా మెలగాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement