Sunday, May 5, 2024

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నేతలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బిజెపి నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా రాస్తారోకో కార్య క్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల నడ్డి విరిగేలా విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై పెను భారం మోపారు అన్నారు. అంతేకాకుండా రైతులను కూడా ఇబ్బంది పెట్టేందుకు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసి సీఎం కేసీఆర్ తప్పించుకుంటున్నారని అన్నారు. పైగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారని ఈ విధానం కెసిఆర్ కు తగదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కీర్తి రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని కెసిఆర్ దిష్టిబొమ్మను అంబేద్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement