Monday, April 29, 2024

ప్రేమోన్మాది అజర్ ను ఉరితీయాలి: మహిళ మోర్చ డిమాండ్

ప్రేమోన్మాది అజర్ ను ఉరితీయాలని భారతీయ జనతా పార్టీ మహిళ మోర్చా అధ్యక్షురాలు బండరి కల్యాణి డిమాండ్ చేశారు. మహిళ మోర్చ ఆధ్వర్యంలో ఎంజిఎం సెంటర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ ప్రమోన్మాది అజర్ దాడిలో గాయపడిన అనూషకు న్యాయం చేయాలని, అజర్ కు వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. టీఆరెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. మహిళలపై  జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలం అయిన హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళపై జరుగుతున్న అత్యాచారలకు టీఆరెస్ ప్రభుత్వం, జిల్లా నాయకులు బాధ్యత వహించాలన్నారు. అనూషకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించి చికిత్స చేయించాలని కళ్యాణి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement