Friday, April 26, 2024

మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యం : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట : మహిళలకు ఆర్ధిక స్వాతంత్రం రావాలనే లక్ష్యంతో ఎన్ఏసీ ఆధ్వ‌ర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకురావడం జ‌రిగింద‌ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ మండలి సౌజన్యంతో ఎన్ఏసీ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్ర‌క్షన్) స్కిల్ డెవలప్మెంట్ సంస్థ – నర్సంపేట ఆధ్వర్యంలో నేటికి 90 రోజుల ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు “ఉచిత కుట్టు మిషన్ల” పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి కల్పించడం కోసం ఎన్నో ఆలోచన చేసామ‌ని, చేసిన ఆలోచనలన్నీ ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ ఈరోజు ఒక మెట్టు ఎక్కగలిగామ‌న్నారు. మహిళలకు ఉపాధి గురించి అవగాహన కల్పించి ప్రభుత్వం తరపున ఉన్న అవకాశాలను తీసుకురావడానికి ఎన్ఏసీ సేవలను ఇక్కడికి తీసుకురావడం జరిగింద‌న్నారు. ఈరోజు మూడవ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది, భవిష్యత్తు తరాలను కాపాడే లక్ష్యంతో ఎంతో ముందస్తు లక్ష్యంతో సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ టెక్స్ట్ టైల్స్ పార్క్ ను సంగెం మండలంలో తీసుకురావడం జ‌రిగింద‌ని, అప్పుడు నర్సంపేట పట్టణం మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరామ‌న్నారు.

మహిళలకు ఆర్ధిక స్వాతంత్రం రావాలనే లక్ష్యంతో ఎన్ఏసీ ఆద్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకురావడం జ‌రిగింద‌న్నారు. బ్యాచ్ ల వారీగా ట్రైనింగ్ ఇచ్చి స్కిల్స్ ఉన్నటువంటి వారిని తయారు చేయడం జ‌రిగింద‌న్నారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్క మహిళ కి టెక్స్టైల్ పార్కులో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామ‌న్నారు. ఎన్ఏసీ అనేది తెలంగాణ ప్రభుత్వ సంస్థ అని, దీనికి సీఎం కేసీఆర్ ఛైర్మెన్ అయితే మంత్రి ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ అన్నారు. ఎన్ఏసీ సంస్థ అన్ని రకాల శిక్షణలు ఇస్తుంద‌ని, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను నర్సంపేట నియోజకవర్గ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్రమంలో ఓడీసీఎంఎత్ చైర్మన్, ఖానాపూర్ ఎంపిపి, ఎన్ఏసీ సంస్థ ఏడీ డి.గోపాల్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డియర్ట్మెంట్ ప్రసాద్, ఎన్ఏసీ సిబ్బంది తోపాటు ట్రైనర్ అనూష, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement