Sunday, May 19, 2024

రైతు చ‌ట్టాలను తక్షణమే రద్దు చేయాలి: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

కేసముద్రం, కేంద్రం తెచ్చిన రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని,పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారుల విచక్షణరహితంగా దాడులు చేయడం తక్షణం నిలిపివేయాలని, పొడుగు చేసుకుంటున్న రైతులకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతుకూలి సంఘం, ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతుకూలి సంఘం, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ప్రజా మహా ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతు కేసముద్రం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కట్ యార్డు లో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు శివారపూ శ్రీధర్ , అఖిలభారత రైతుకూలి సంఘం మండల నాయకులు బట్టు నాగేశ్వరరావు, కొట్టం అంజన్న మాట్లాడుతూ సుమారు నూట పది రోజుల నుండి రైతులు ఢిల్లీ కేంద్రంలో గిట్టుబాటు ధర చట్టం తేవాలని, కేంద్రం రచనల చట్టం తక్షణం రద్దు చేయాలని ఆందోళనలు నిర్వహిస్తుంటే మోడీ సర్కార్ బహుళజాతి కంపెనీ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తెచ్చిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని లేనియెడల ప్రజల ఆందోళనలు దశలవారీగా నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే కెసిఆర్ సర్కార్ ఆదివాసీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పోడు సాగు దారులపై సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తోందని, పైగానేనే స్వయoగా సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి పరిష్కరిస్తానని చెప్పిన కూడా ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ మాటకు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారులు విచక్షణరహితంగా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. పోడు అంశంపై ప్రభుత్వం గాని, ఫారెస్ట్ అధికారులు కపట నాటకం ఆడుతున్నారని, ఇప్పటికైనా ఆ నాటకానికి తెర దింపాలని కోరుతూ తక్షణము కూచిపూడి సాగుచేసుకుంటున్న సాగు దారులకు తక్షణమే పట్టాలివ్వాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ , అఖిలభారత రైతుకూలి సంఘం నిర్వహిస్తున్న పోరాటాలకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తూ మహబూబాద్ లో జరిగే పోడు రక్షణకై నిర్వహిస్తున్న బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి బ్రహ్మచారి, వల్లాల వెంకన్న,. పరకాల యాకయ్య, వాంకుడోత్ హత్తి రామ్, భానోత్ మంగ్య, మునిగంటి సుధాకర్, కత్రోజు నరసింహచారి, కోమ్మన బోయిన మల్లయ్య, దాసరి స్వరప, జల్లే సైదులు, ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జిల్లా నాయకురాల్లు శివారపు శారద, రామడుగు శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement