Monday, May 6, 2024

కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి… ఎమ్మెల్యే బొల్లా

వినుకొండ , : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నదని మన జిల్లాలో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయం లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలని శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని ఇటువంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చు అన్నారు.అదేవిధంగా పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల యందు కోవిద్ వ్యాక్సిన్ అందుబాటులో యున్నదని ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ ను వేయించుకోవలసినదిగా తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాల తోపాటుగా పట్టణంలోని ఆరోగ్యశ్రీ పధకము అందుబాటులో ఉన్న వైద్యశాలలు ,వెన్నెల నేత్రాలయం, నిమ్స్ 24 హాస్పిటల్, డాక్టర్ మాధవరావు హాస్పిటల్, బాలాజీ హాస్పిటల్, తిరుమల నర్సింగ్ హోమ్ ల నందు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నదని తెలిపారు.ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వ్యాక్సిన్ వలన సమస్యలు వస్తున్నాయని చేసే పుకార్లను నమ్మవద్దని నేను కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగిందని ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదన్నారు.వైద్యుల సలహా మేరకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుని కరోనా వైరస్ ను కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ దస్తగిరి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement