Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(06-05-2024)

మేషం : కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటు-ంది.

వృషభం : శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటు-ంది. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

మిథునం : నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం : రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కుటు-ంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి.

- Advertisement -

సింహం : ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్య : సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. స్త్రీలు బంధు, మిత్రులను కలుస్తారు.

తుల : బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది.ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటు-ంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

వృశ్చికం : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి.

ధనుస్సు : ఆకస్మిక ధనలాభం ఉంటు-ంది. రుణబాధలు తొలగిపోతాయి. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటు-ంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. శత్రుబాధలు ఉండవు.

మకరం : కుటు-ంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

కుంభం : ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఆందోళనతో ఉంటారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. కుటు-ంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

మీనం : ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటు-ంది. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటు-ంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటు-ంది. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement