Saturday, September 7, 2024

Wagon Factory – ఏ ఫ్యాక్టరీ అయితేనేం… మన వాళ్లకు ఉపాథి లభిస్తుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

వరంగల్: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఫ్యాక్టరీకి పెద్దగా తేడా  లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. ఆదివారంనాడు వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే  బహిరంగ సభ స్థలాన్ని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ,బి జెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇతర బీజేపీ నేతలు  పరిశీలించారు.  రైల్వే అధికారులతో  ప్రధాన మంత్రి  రైల్వే వ్యాగన్ల తయారీ  ఫ్యాక్టరీకి శంకుస్థాపన  ఏర్పాట్ల గురించి  చర్చించారు.  

ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏ ఫ్యాక్టరీ  అయితేనేం  ఈ ప్రాంత ప్రజలకు  ఉపాధి కల్పించే  ఉద్దేశ్యంతో వ్యాగన్ల ఫ్యాక్టరీని  కేంద్రం ప్రారంభించనుందన్నారు. ఈ నెల 8వ తేదీన కాజీపేటలో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కాజీపేటలో నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే సామర్ధ్యంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. వ్యాగన్ల ఫ్యాక్టరీతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.

అలాగూ రూ. 587 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు. రూ. 1127 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే కు, రూ.5587 కోట్ల తో నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణం పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధి తో పాటు చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణ అభివుద్ది కోసం ఎనలేని కృషి చేస్తున్న ఇక్కడి ప్రభుత్వం కేంద్రం పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కెసిఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న వివక్ష లేకుండ అభివృద్దే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని అంటూ వరంగల్ కు వస్తున్న ప్రధాన మంత్రి కి వరంగల్ ప్రజలు ఘన స్వాగతం పలకాలని పిలుపు ఇచ్చారు..

- Advertisement -

వరంగల్ కు చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రహదారుల భూమి పూజల్లో పాల్గొంటారని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్ద పీట వేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో రీజినల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూమి ఇస్తే అంత త్వరగా ఈ పనులు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమపై బురదచల్లుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.వరంగల్ కు టెక్స్ టైల్స్ పార్క్ కు కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైనిక్ స్కూల్ కు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నారు.ఈ ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా స్పందన లేదన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వెంటనే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement