Sunday, December 8, 2024

TS : ఇద్దరు చిన్నారులు మృతి… పరారీలో పేరెంట్స్

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్న గూడెంలో నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పద స్థితిలో ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు లోహిత (3), జశ్విత(1) గా గుర్తించారు. కాగా చిన్నారులకు పాలలో విషం కలిపి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు అనిల్, దేవి పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. బయ్యారం మండలం నామాలపాడులో అనిల్‌, దేవి తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారం క్రితం అనిల్‌ తమ స్వగ్రామం అంకన్నగూడెంకు కుటుంబంతో కలిసి వచ్చాడు. అతడి తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున షాపునకు వెళ్లిన వెంకన్న.. తిరిగి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. కుమారుడు, కోడలు కనిపించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement