Monday, April 29, 2024

TS : శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

కర్మన్ ఘాట్, మార్చి 10( ప్రభ న్యూస్): హస్తినాపురం డివిజన్ అనుపమ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను నేటి నుండి బుధవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ ధ్వజారోహణ గణపతి మూర్తికి అభిషేకం సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకం ,లక్ష్మీ గణపతి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

సాయంకాలం నాలుగు గంటలకు మండప పూజలు ,రుద్ర హోమము, శివపార్వతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి అభిషేకం, చండీ హోమం, మండప పూజలు, సాయంకాలం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, శాంతి మండప పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరి రోజు 13 మార్చి బుధవారం 8 గంటలకు 108 కళాశాలతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం, మహా సుదర్శన సహిత లక్ష్మీనారాయణ మూలమంత్ర సాయిత నారాయణ శ్రీ సూక్త భూసూక్త హోమములు, మహా పూర్ణావతి ,వేద ఆశ్వీరచనం, పండిత సత్కారం, మండప పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంకాలం ఐదు గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజుల కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

మూడు రోజుల హోమానికి యాజమాన్యం వహించడానికి 6116 రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. పాల్గొన్న వారికి స్వామి వారి శేష వస్త్రం, తలంబ్రాలు ,ప్రత్యేక ప్రసాదం ఇవ్వబడునని తెలిపారు. చతుర్ధ వార్షికోత్సవ అన్ని పూజలకు భక్తుల గోత్రనామాలతో ఒక జంటకు 2500 చెల్లించవలసి ఉంటుందన్నారు. స్వామివారి అన్ని హోమాలకు పాల్గొన్నవారు వెయ్యి రూపాయలు ,స్వామివారి ఒక్క పూట హోమానికి 500 రూపాయలు, స్వామివారికి 108 కళాశాలతో అభిషేకం ఒక్క కలశాభిషేకానికి వెయ్యి రూపాయలు వారికి కలశంతో పాటు కొబ్బరికాయ ప్రసాదంగా ఇవ్వబడునని తెలిపారు. స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్న వారు 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు. కుంకుమార్చన కార్యక్రమానికి 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాల్గొని వారు దేవాలయం కమిటీని సంప్రదించాలని వారు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement