Sunday, April 28, 2024

Cheryala: మత్తడి స్థలంలో పశువుల సంతను పునర్ ప్రారంభించిన తుల్జా భవాని రెడ్డి

చేర్యాల: చేర్యాల మండల కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి స్థలంలో జరిగే పశువుల సంతను దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి ప్రారంభించారు. మూడు సంవత్సరాల క్రితం మత్తడి స్థలాన్ని కొన్నామని దాని చుట్టూ సిమెంట్ పలకలు వేసి ఎవరిని కూడా లోనికి అనుమతించకపోవడంతో పశువుల సంత కూడా జరగడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తన పేరిట ఉన్న మత్తడి స్థలాన్ని మున్సిపాలిటీకి ఇస్తున్న అని చెప్పడంతో అక్కడ పశువుల సంతను తుల్జా భవాని రెడ్డి చేతుల మీదుగానే స్థానిక నాయకులు ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా ఎదురుపడిన భవాని రెడ్డితో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి తాను మిమ్మల్ని ప్రేరేపించి ఇదంతా చేయిస్తున్నానని ఎమ్మెల్యే అంటున్నారని అనడంతో తుల్జా భవాని రెడ్డి స్పందిస్తూ.. తాను కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని చూడడం ఇదే మొదటిసారి అని అన్నారు.

ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

కొమ్మూరి ప్రతాపరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఇరిగేషన్ అధికారులను కానీ ఇతర అధికారులు కానీ స్వేచ్ఛగా పని చేసుకొనీచ్చానని, ప్రస్తుతం ఎమ్మెల్యే అధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని తాను చెప్పినట్టుగా వినే విధంగా బెదిరిస్తున్నారని, అధికారులు ఎవరికీ తలొగ్గకుండా పనిచేయాలన్నారు. గతంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం నుండి కూడా మత్తడి నీరు చేర్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీలో నుండి వెళ్తూ కుడి చెరువులో కలిసేదని, మత్తడి నీరు ప్రకృతిరీత్యా ఎటు ఒంపు ఉంటే అటు వెళ్తుందని, అలా కాదని కొత్తగా మత్తడి భూమిలో నుండి కాలువలు తీసి రైతుల భూములను కూడా లాక్కొని కెనాల్ నిర్మిస్తామనడం సరికాదన్నారు. ఈ ముత్తడి భూమిలో ఇప్పటినుండి పశువుల సంత యధావిధిగా కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, అతని బినామీలకు కలిపి దాదాపు 1000 ఎకరాల భూమి ఉంటుందన్నారు. స్థానికేతరుడు కాబట్టే స్థానిక ప్రజలను దోచుకుంటున్నాడని ఆరోపించారు. చేర్యాల ప్రజలు ప్రతిది గమనిస్తున్నారని, త్వరలోనే అధికార పార్టీకి గట్టి గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు కొమ్ము నర్సింగరావు, దాసరి కళావతి, మత్తడి పరిరక్షణ సమితి చైర్మన్ అవుశర్ల యాదయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్, సిపిఎం మండల కార్యదర్శి వెంకట్ మావో, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఒగ్గురాజు, పిఎసిఎస్ డైరెక్టర్ వెలుగుల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వెలుగల దుర్గయ్య, దాసరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement