Friday, May 10, 2024

సాధన ద్వారా ఆత్మోద్ధరణ!

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్‌|
ఆత్మైవ హ్యాత్మనో బంధు: ఆత్మైవ రిపురాత్మన:||
(భగవద్గీత 9వ అధ్యాయం, 5వ శ్లోకం)

నీ మనస్సు శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు- మనస్సే మన శత్రువు అవ్వచ్చు అన్నది ఈ శ్లోకం తాత్పర్యం. మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం అని, మన కోసం వేరెవ్వ రూ భగవత్‌ ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదని, గురువులు, మహాత్ములు మనకు మార్గం మాత్రమే చూపుతారు కానీ మనమే స్వయంగా ఆ పథంలో ప్రయాణిం చాలని శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకొని పై శ్లోకం ద్వారా కర్తవ్య బోధ న చేస్తున్నారు.
ఆత్మసాక్షాత్కారం, భగవద్దర్శనం పొందిన మహాత్ములు ఈ భూమిపై ఎప్పుడూ అవతరిస్తూ మానవాళికి సరైన దిసానిర్దేశం చేయడానికి సిద్ధంగా వుంటారు. అయితే అత్యధికులు భగవంతుని కృప పొందలేకపోవడానికి మార్గదర్శకత్వం లేకపోవటం సమస్య కాదు, దానిని స్వీకరించకపోవటం లేదా దానిని ఆచరించక పోవటమే సమస్య అని మనం గుర్తెరగాలి. మనం పురోగతి సాధించే ముందు, మన ప్రస్తుత ఉన్న ఆధ్యాత్మి క స్థాయికి, లేదా అది లేకపోవటానికి మనమే బాధ్యులం.
మన ఆధ్యాత్మిక స్థాయి పురోగతికి లేకపోవటానికి మనమే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మనకు, మన ప్రస్తుత పురోగతి స్థాయి మన ప్రయత్నం ద్వారానే సాధించాము మరింత పరిశ్రమ ద్వారా మనలను ఇంకా ఉద్ధరించుకోవచ్చు అన్న ధైర్యం వస్తుంది.
శ్రీకృష్ణుడు, మనం మనస్సుని ఉపయోగించుకొని ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి అం తే మన ఉన్నత మనస్సుని ఉపయోగించుకొని, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని అర్ధం. అంటే వేరే మాటల్లో చెప్పాలంటే, బుద్ధిని ఉపయోగించుకొని మనస్సుని నియంత్రించాలి.
ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు. ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి, ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి, ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. అంతేగాని ఇంకొకరు మనకు ఈ విషయంలో సహాయం చేయడంలేదని విమర్శించడం సరికాదని ఈ శ్లోకం అంతరార్ధం. మనస్సు భౌతిక స్వభావంపై ఆధిపత్యం వ#హంచాలని కోరుకునే స్థితిలో సదా నిమగ్నమై ఉంది. కావున, భౌతిక ప్రకృతి మెరుపులచే ఆకర్షించబడకుండా మనస్సును నియంత్రించాలి. ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షణతో తనను తాను దిగ జా ర్చుకోకూడదు. మానవుడు ఇంద్రియ వస్తువులకు ఎంతగా ఆకర్షితుడవుతాయో, అం త ఎక్కువగా భౌతిక ఉనికిలో చిక్కుకుపోతాడు. తనను తాను విడదీయడానికి ఉత్తమ మార్గం మనస్సును ఎల్లప్పుడూ భగవత్‌ చైతన్యంలో నిమగ్నం చేయడం. అదే దివ్య యోగం అంటే.

Advertisement

తాజా వార్తలు

Advertisement