Sunday, April 28, 2024

West Bengal – మ‌మ‌తా బెన‌ర్జీ హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ .. మోకాలికి గాయం

కోల్ కోత – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. దాంతో హెలికాప్టర్ ను మార్గమధ్యంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు . బాగ్డోగ్రా ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ లో జల్పాయ్ గురికి బయల్దేరారు. అయితే భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి.

ఆకాశం మేఘావృతమై ఉండడంతో సలుగరా ఆర్మీ ఎయిర్ బేస్ లో హెలికాప్టర్ ను అత్యవసరంగా కిందికి దించారు. ఈ సమయంలోనే మమతకు స్వల్ప గాయాలయ్యాయి.. మోకాలికి గాయం కావడంతో ప్రాథమిక చేసి అంబులెన్స్ లో కోల్ కోతకు తరలించారు.. స్వల్ప గాయమనేనని ఎవరు కంగారు పడాల్సిన పని లేదని మమత ప్రకటించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్ర‌భావంతో చోప‌ర్ ప్ర‌యాణానికి ఆటంకం ఏర్ప‌డింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement