Saturday, April 27, 2024

TS: వరంగల్ జిల్లాలో ప‌శువుల‌కు ఆంత్రాక్స్

Anthrax: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్ సోకిన‌ట్ట తెలుస్తోంది. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో నాలుగు గొర్రెలు, ఒక మేక చ‌నిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన గొర్రెలు సాంబయ్య అనే రైతుకు చెందినవిగా గుర్తించారు. గొర్రెలను ఊరికి దూరంగా ఉంచాల‌ని అధికారులు గ్రామస్తులకు సూచించారు. గొర్రెలకు వ్యాక్సిన్ వేస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement