Friday, April 19, 2024

Telangana: టీకా తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్ కట్

కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో టీకా తీసుకోని వారికి రేషన్‌, పింఛన్ నిలిపివేయనున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. నవంబరు 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానునుందని వెల్లడించారు. తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గలేదని.. దానిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ముఖ్యమని ఆయన తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకుని.. రెండో డోస్ వేసుకోనివారు సుమారు 35 లక్షల మంది ఉన్నట్లు అంచనా. డోస్ తీసుకోవాల్సిన డేట్ దాటిపోయినా కూడా వారు వ్యాక్సిన్ తీసుకోలేదు. దీంతో వైరస్ మరోసారి విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ కు పవన్.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement