Monday, May 13, 2024

రైతుల ధ‌న్యాన్ని ప్ర‌భుత్వ‌మే పూర్తిగా కొనుగోలు చేయాల‌ని టీడీపీ డిమాండ్

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. సోమవారం ప్రజావాణి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అంద‌జేశారు. అనంతరం మెదక్ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఇళ్లేందుల రమేష్ మాట్లాడుతూ… రైతులు కష్టపడి పండించిన పంటను కొనే నాధుడు లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థంతో కేంద్రం పై, కేంద్రం రాష్ట్రం పై ఒకరికొకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా యాసంగిలో రైతులు ఏ పంట వేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఇల్లేందుల రమేష్ తో పాటు రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి యండి ఖాజా, టౌన్ పార్టీ అధ్యక్షులు నరేందర్ చక్రవర్తి గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బందెన్న గౌడ్, ప్రకాష్, అయ్యప్ప, పార్లమెంట్ ఉపాధ్యక్షులు కరికే సత్యనారాయణ యాదవ్, యువత నాయకులు మల్లేశం యాదవ్, కుమార్, నహీము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement