Sunday, April 28, 2024

Breaking: వ‌డ్ల కొనుగోలుపై మొండి వైఖ‌రి వ‌ద్దు.. స‌ర్కారు తీరుపై ఈట‌ల కామెంట్స్‌..

ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడం లేదని.. ఉప్పుడు బియ్యానికి బదులుగా ముడి బియ్యం ఇవ్వమని చెబుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మొండి వైఖరికి పోకుండా.. రైతులకు అన్యాయం జరగకుండా ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేంద‌ర్‌ సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు.

దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం హుజూరాబాద్​ ఉప ఎన్నిక అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా.. అంతిమంగా ప్రజలు ధర్మాన్నే గెలిపించారని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయకుండా.. ప్రతి గింజా కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఈటల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రత్యామ్నాయ పంటల వైపు సాంకేతికత సాయంతో.. నూకలు రాకుండా ధాన్యాన్ని ఆడించే మిల్లులు అందుబాటులోకి తీసుకురావాలని ఈటల అన్నారు. వరి వేస్తే ఉరి అని బెదిరింపులకు పోకుండా.. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు చేయాలని అభిప్రాయపడ్డారు. రాగులు, సజ్జలు, కొర్రలకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని.. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.బెదిరింపులకు పాల్పడ్డారుదళిత బంధు అమలు చేయడానికి నిధులు లేకనే.. ఆ పథకాన్ని ఆపడానికి తనపై తప్పుడు కథనాలు సృష్టించారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో తెరాసకు ఓటేయకపోతే పింఛను, సీఎం రిలీఫ్​ ఫండ్​ తదితర పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పసుపు, కుంకుమ ఇచ్చి.. ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement