Saturday, April 27, 2024

బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటి: ఉప్పల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య భౌతికకాయానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని  రోశయ్య నివాసానికి చేరుకుని ఆయన పార్ధీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. ఆర్ధిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య..సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని హూందాతనాన్ని నిరూపించుకున్నారని కొనియాడారు. ఆర్యవైశ్య జాతి ముద్దుబిడ్డ, వైశ్య రత్నం, వారి సేవలను వారి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు..మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిందని చెప్పారు. 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత..రోశయ్య అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. 2009 –10 బడ్జెట్ తో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య గారు ఘనాపాటిగా పేరుపొందారని ఉప్పల శ్రీనివాస్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement