Wednesday, May 8, 2024

సీఎం స్టాలిన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం .. ‘త‌మిళ భాష’ త‌ప్ప‌ని స‌రి..

రాష్ట్రానికో భాష , ప్రాంతానికో పాల‌నా ఇదంతా తెలిసిన విష‌య‌మే.. మాతృభాష అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. అయితే ఆ మాతృభాష‌ని విస్మ‌రిస్తున్నావారు ఉన్నారు. కాగా సీఎంగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ని చూర‌గొన్నారు స్టాలిన్ . ప్ర‌తిప‌క్షాలు సైతం వేలెత్తిచూప‌కుండా దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేయ‌కుండా వాటిని కొన‌సాగిస్తూ త‌న‌దైన‌శైలిలో గుర్తింపు పొందారు. పొగ‌డ్త‌లు వ‌ద్దని, మంత్రులు ఇంటినుంచే కారియ‌ర్ ని తెచ్చుకోవాల‌ని ఇలా ప‌లు నిబంధ‌న‌లు విధిస్తూ వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కి ప్ర‌తిప‌క్షాల నేత‌లు మెచ్చుకునే ప‌రిస్థితి నెల‌కొంది. కాగా స్టాలిన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర విద్యాలయాల్లో తమిళ భాష తప్పని స‌రి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే తమిళ భాష తెలిసి ఉండాల్సిందేన‌ని చెప్పి మాతృభాష‌పై త‌న‌కి ఉన్న మ‌క్కువ‌ని చాటిచెప్పారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో తమిళ భాష ప్రవేశ పరీక్షను పాసైతేనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళుల్లో భాషాభిమానం ఎక్కువ‌నే చెప్పాలి. ఇటీవల జొమాటో విషయంలో తమిళ ,హిందీ భాషపై జరిగిన వివాదంలో జొమాటో కంపెనీ అధినేత తమిళ భాషలో క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందంటేనే ఇక్కడి ప్రజలకు ఎంత భాషాభిమానమో అర్థం మ‌వుతోంది. అలాగే ఇక్కడి వారు హిందీని జాతీయ భాషగా ఒప్పుకోమని చెప్పారు. తమిళులను ఎవరైనా చిన్న చూపు చూస్తే సహించేది లేదన్నారు.

ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో .. ఉత్తర ప్రత్యుత్తరాలను తమిళ భాషలోనే జరుపుతుంటారు.స్టాలిన్ తీసుకునే నిర్ణ‌యాల‌న్ని సాహసోపేతంగా, ఆచ‌రించ‌ద‌గిన‌విగా ఉంటాయి.. రోడ్డు ప్రమాదాల్లోని బాధితులకు 24 గంటలపాటు ఉచిత చికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా వర్తిస్తుందని చెప్పారు. మరోవైపు ఆకస్మికంగా ప్రభుత్వ కార్యాలయాలు సందర్శిస్తూ ఉద్యోగుల పనితీరుపై ఫోకస్ పెడుతున్నారు స్టాలిన్. అభివృద్ధికి మొట్ట మొదటి ప్రాధాన్యం ఇస్తున్న డీఎంకే సర్కార్ తాజాగా భాషాకు సంబంధించిన ఈ నిర్ణయం తీసుకోవడంతో తమిళుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించే పోటీ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తమిళ పరీక్ష తప్పని సరి రాయాలని వెల్ల‌డించారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి అన్నారు. అయితే తాజా విధానంతో సమాజిక న్యాయం ప్రబలేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రిక్రూట్ మెంట్ విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంద‌న్నారు. ఇదే సమయంలో తమిళ పరీక్షలో ఫెయిల్ అయితే కష్టమేనని ఉత్తర్వులో పేర్కొన్నారు. మొత్తం పరీక్ష ప్లాన్ లో భాగమైన ఇతర సబ్జెక్ట్ పేపర్లు ఆర్డర్ ప్రకారం మూల్యాంకనం తీసుకోబడుతాయని ఇందులో తమిళ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలని తెలిపారు. టీచర్స్ రిక్రూట్ మెంట్ మెడికల్ బోర్డు తమిళనాడు యూనిఫాండ్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ కమిటీతో సహా ఇతర రాష్ట్ర రిక్రూట్ మెంట్ ఏజెన్సీలు ఇవే మార్గదర్శకాలు విడుదల చేస్తాయని వివ‌రించారు. తమిళ భాషపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ భాషకు ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మందికి, తొమ్మిది లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో భాషకు ఎనలేని గుర్తింపు వస్తుందని తెలిపారు. మ‌రి మిగ‌తా రాష్ట్రాల మాటేంటి.. స్టాలిన్ ని ఫాలో అవుతారా. ఎవ‌రి మాతృభాష‌ని వారు కాపాడుకుంటారా అనేది తెలాల్సి ఉంది. స్టాలిన్ తీసుకున్న నిర్ణ‌యంతో త‌మిళులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement