Sunday, May 12, 2024

Congress: తెలంగాణ సీఎం తేలేది నేడే

తెలంగాణ సీఎం ప్ర‌క‌ట‌న‌ను కాంగ్రెస్ నేడు ప్ర‌క‌టించ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ తెలంగాణ సీఎంగా ఎవరు ఉండాలనేది ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.

పార్టీ హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపుతోందని.. సోమవారం రాత్రికల్లా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ తీరా కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సీనియారిటీ, ఇతరత్ర అంశాలు ప్రాతిపదికగా మంగళవారం రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందనే టాక్ తెరపైకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement