Thursday, May 2, 2024

Heavy Rains – వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో రెడ్ అలెర్ట్ … ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన

మిజౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది..

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలుతుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణశాఖ.. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావిత జిల్లాలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement