Thursday, May 2, 2024

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ బోర్డర్ మూసివేత..

భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలాం చేస్తోంది. వర్షం కారణంగా వరద ముంచెత్తుతోంది. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వరద నీరు స్థంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 163 పైకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.
గోదావరి వరద నీరు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి వెళ్లే జాతీయ రహదారి పైకి వాజేడు మండలంలోని పావురాల వాగు బ్రిడ్జి పైకి చేరడంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇక ఇవాళ, రేపు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశముండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : పెగాసస్ పై చర్చకు విపక్షాల పట్టు..

Advertisement

తాజా వార్తలు

Advertisement