Saturday, April 20, 2024

మూడో వన్డేలో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు చోటు

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఐదుగురు కొత్త ఆటగాళ్లకు చోటిచ్చింది. సీనియర్ ఆటగాళ్లు భువనేశ్వర్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్ స్థానాలలో సంజు శాంసన్, నితీష్ రానా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, చేతన్ సకారియాలకు స్థానం కల్పించింది. వీళ్ల ఐదుగురికి ఇదే తొలి అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. మరోవైపు ఇషాన్ కిషన్ స్థానంలో నవదీప్ శైనీకి జట్టు యాజమాన్యం అవకాశం కల్పించింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న భారత్‌కు ఇది నామమాత్రమైన వన్డే కావడంతో తుదిజట్టులో ఏకంగా ఆరు మార్పులు చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు వన్డేల్లో శ్రీలంక టాస్ గెలిచిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: టాస్ వేసిన తర్వాత రద్దయిన వన్డే మ్యాచ్

Advertisement

తాజా వార్తలు

Advertisement