Wednesday, May 8, 2024

ర్యాలీలు, ఊరేగింపులకు కంప‌ల్స‌రీ ప‌ర్మిష‌న్ ఉండాలే.. నిజామాబాద్​ సీపీ నాగ‌రాజు

ర్యాలీలు, ఊరేగింపుల‌కు పోలీసుల ప‌ర్మిష‌న్ కంప‌ల్స‌రీ ఉండాల‌న్నారు నిజామాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ కేఆర్ నాగ‌రాజు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధ‌న్ డివిజన్ పరిధిలోని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, స్వ‌చ్ఛంద సంస్థలు, ఇతర యూనియన్లు, అనుబంధ సంస్థలు ఎవ‌రైనా స‌రే త‌మ ప‌ర్మిష‌న్ లేనిది నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌న్నారు. కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తే డివిజనల్ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు సూచించారు.

ప్రజలకు ఎక్కడా అసౌకర్యం లేదా ఇబ్బంది కలిగించకుండా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారి అనుమతి తీసుకోవాలన్నారు నిజామాబాద్‌ సీపీ. కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్డు షోలు మొదలగునవి డివిజనల్ పోలీసు అధికారి అనుమతి లేకుండా నిర్వహించినట్లయితే వారిపై పోలీసు యాక్టు ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంట‌మాని వెల్ల‌డించారు సీపీ నాగ‌రాజు.

Advertisement

తాజా వార్తలు

Advertisement