Monday, April 29, 2024

వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం వల్లకాడు .. చంద్రబాబు

మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో హత్యలు, అరాచకాలపై టిడిపి ప్రచురించిన పుస్తకాన్ని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. వైసీపీ దమనకాండపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చంద్రబాబు, టీడీపీ నేతలు తిలకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వేధింపులు, హింసతో ప్రజలను, రాజకీయ పార్టీ నేతలను భయపెడుతున్నారన్నారు. మూడేళ్ల పాలనలో 60 మంది టిడిపి ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారన్నారు. గ్రామ స్థాయి లో 4 వేల మందిపై కేసులు పెట్టారన్నారు. ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను జైలుకు పంపారన్నారు. నాతో సహా పార్టీలో టీడీపీ నేతలు అందరిపైనా కేసులు పెట్టారన్నారు. దళితులు, గిరిజనులు, బిసి, మైనారిటీలపై హత్యాకాండ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ను సరిగా ఎదుర్కోని కారణంగా 88 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్రంలో 2552 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 37 మంది టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఇందులో 24 మంది బిసి నేతలు ఉన్నారన్నారు. డిజిపి మారినా రాష్ట్రంలో పోలీసు శాఖలో మార్పు రాలేదన్నారు. పోలీసులు ఇప్పటికైనా మారకపోతే…మార్చే శక్తి ప్రజలకు ఉందన్నారు. ఒక్క మాచర్లలో ఐదుగురిని చంపేస్తే…నలుగురు యాదవ వర్గం వారేనన్నారు. మాచర్లలో జల్లయ్యను చంపితే మా నేతలు వెళ్లకూడదా….పోలీసులు మా హక్కులు ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. అనంతబాబు అనే ఎమ్మెల్సీ డ్రైవర్ ను చంపేసి డెడ్ బాడీ ఇంటి దగ్గరకు తెచ్చిపడేస్తాడా.. ప్రజా సంఘాలు, టిడిపి నేతలు ఆందోళన చేస్తే తప్ప ఎమ్మెల్సీని అరెస్టు చెయ్యరా అని చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా కేసులో ఉన్న శ్రీనివాస రెడ్డి, గంగిరెడ్డి, గంగాధర్ రెడ్డి మరణాలకు కారణం ఏంటని ప్రశ్నించారు. డ్రైవర్ దస్తగిరి తనను చంపేస్తాను అని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కడప నుంచి వెళ్లిపోకపోతే బాంబులు వేస్తాం అని సిబిఐని బెదిరించారన్నారు. జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2 లక్షల మంది టెన్త్ విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారు… 8 మంది టెన్త్ విద్యార్థుల మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిఐడి ఎందుకు ఉంది…..41 ఎ నోటీసు ఇవ్వడానికి కాదన్నారు. ఎంపి రఘురామ కృష్ణం రాజును అరెస్టు చేసి తీవ్రంగా వేధిస్తారా అని ప్రశ్నించారు. ఏ2 విజయసాయి రెడ్డికి ఎవ్వరూ భయపడరు.. వస్తానంటే రమ్మనండి.. చూద్దాం అన్నారు. నేరస్తులకు నేరాలోచనలే వస్తాయని, ఎన్నిసార్లు వస్తారో రమ్మనండి చూద్దాం.. ఖబడ్దార్ చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement