Monday, May 6, 2024

12న పాఠశాలలు, జూనియర్ కళాశాలలు బంద్

మహబూబ్ నగర్, జూలై 9 (ప్రభ న్యూస్) : విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈనెల 12న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే బంద్ ను జయప్రదం చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు భరత్ కోరారు. ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న పాఠ్యపుస్తకాలు అందించలేదని, మధ్యాహ్న భోజనం పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని,మన ఊరు మనబడి మనబస్తీ మనబడి నిధులు రాక కనీసం మౌలిక సదుపాయాలు లేక అనేక పాఠశాలలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు..


AISF జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని మండి పడ్డారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు.

PDSU జిల్లా అధ్యక్షుడు మారుతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారం గాన్ని పూర్తిగా విస్మరించిందని కనీస బాధ్యతతో విద్యారంగంలో బడ్జెట్ కేటాయించకుండా విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు నందు, పిడిఎస్యు జిల్లా నాయకులు చిన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement