Thursday, May 2, 2024

ఎబివిపి ఆవిర్భావ దినోత్సవం – రక్తదాన శిబిరం ఏర్పాటు

మక్తల్, జులై9(ప్రభన్యూస్) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) 75వ ఆవిర్భావ దినోత్సవం జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఎబివిపి ఆధ్వర్యంలో మక్తల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎంపీపీ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ఎబివిపి జెండాను ఆవిష్కరించి తాను రక్తదానం చేస్తూ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ జ్ఞానం శీలం ఏకత లక్ష్యంగా జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా 1949 జూలై 9న ఎబివిపి ఆవిర్భవించడం జరిగిందన్నారు.. .75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ఆయన స్థానిక ఎబివిపి నాయకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎబివిపి నగర అధ్యక్షులు అంజిరెడ్డి ,వంశీ, వినయ్, నరేష్ ,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement