Thursday, May 2, 2024

మాజీ ప్రధాని పీవీ స్వగృహం నుండి రథయాత్ర ప్రారంభం

భారత మాజీ ప్రధాని పీవీ సొంత ఊరు వంగర గ్రామంలో ప్రతి ఏటా కొత్తకొండ జాతర సందర్భంగా బండ్లు తిరిగే రోజన నిర్వహించే వీరభద్ర రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గత తొమ్మిది దశాబ్దాల కాలంగా పివి కుటంబీకులు ఈ వేడుక నిర్వహిస్తున్నారు. పివి.ప్రభాకర్ రావు, రాఘవేంద్ర కాశ్యప్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

గ్రామపంచాయతి సభ్యులు వేడుక నిర్వహణకు ఎంతగానో తోడ్పాటు అందించారు. పి.వి.స్వగృహంలో ప్రారంభమైన శోభాయాత్ర గ్రామ పొలిమేర దాటడానికి రెండు గంటల సమయం పట్టింది. రాత్రి వరకు కొత్తకొండ చేరుకుని దేవాలయం చుట్టు పరిక్రమణ తరువాత గ్రామస్థులు సమర్పించిన బియ్యం, బెల్లం, మంచి గుమ్మడికాయలను మొక్కలుగా చెల్లిస్తారు. శివసత్తుల పూనకాలు, డోలు విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, మహిళల కోలాటల నడుమ శోభాయానంగా రథ యాత్ర కొనసాగింది.
గతంలో మూడంతస్తులుగా వున్న రథాన్ని విద్యుత్ తీగల వల్ల ఒకే అంతస్తుకు కుదించారు. రథాన్ని లాగడానకి గ్రామ రైతులు ఎద్దులను సమకూర్చుతారు. రథ చక్రాలను కొల్ల వంశస్థులు సమకూర్చుతారు. ఎటువంటి ఇనుము వస్తువులు వాడకుండా కేవలం కలపతో రథాన్ని తయారు చేస్తారు. రథోత్సవం నిర్వహణకు తోడ్పాటు అందించిన ప్రభాకర్ రావుకు గ్రామస్తుల కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement