Sunday, May 12, 2024

సిపిఎం, కాంగ్రెస్‌ నేతల ముందస్తు అరెస్టు..

యాచారం : యాచారం మండల కేంద్రంలో దేశవ్యాప్త బంద్‌కు మద్దతు తెలుపుతున్న సిపిఎం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 120 రోజుల నుండి ఢిల్లిలో లక్ష లాది మంది రైతులు ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ చట్టాలను రద్దు చేయకుండా కార్పోరేట్‌కు అండగా ఉంటూ వారికి మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం రోజు దేశవ్యాప్తంగా భారత్‌బంద్‌కు పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికే 250 మందికి పైగా రైతులు మరణించారని అయిన కానీ కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని ప్రదర్శిస్తునే ఉందని కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతుల ఉద్యమాలు ఆగవని వారికి తమ మద్దతు ఎప్పటికి ఉంటుందని సిపిఎం , కాంగ్రెస్‌ పార్టీ నేతలు అన్నారు. శుక్రవారం అరెస్టు అయిన వారిలో సిపిఎం నాయకులు అంజయ్య, బ్రహ్మయ్య, ధర్మన్నగూడ సర్పంచ్‌ బాషాయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ్మా, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement