Saturday, July 27, 2024

TS | ఎన్నికల నేపథ్యంలో మ‌రిన్ని ప్రత్యేక బస్సులను : స‌జ్జ‌నార్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఓటేసేందుకు సొంతూళ్లకు త‌రలివెళ్లున్నారు. ఈ క్ర‌మంలో సొంత గ్రామాలక వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా… టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు, తెలంగాణలోని జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ వైపునకు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగిందని, ఆయా బస్సుల్లో దాదాపు 3వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. విజయవాడ రూట్‌ వైపునకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు.

టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ కోసం http://tsrtconline.in వెబ్‌ సైట్‌ ని సంప్రదించగలరు. అలాగే, హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను పడుతున్నట్టు తెలిపారు. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను ఆర్టీసీ తిప్పుతోంది. ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కోరుతోందని ఎండీ సజ్జనార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement