Thursday, May 16, 2024

మహిళ మోర్చ ఆధ్వర్యంలో రాస్తారోకో

తాండూరు : నిర్మల్‌ జిల్లా భైంసాలో టీఆర్‌ఎస్‌ రాక్షస పాలన కొనసాగిస్తుందని బీజేపీ వికారాబాద్‌ జిల్లా సదానందారెడ్డి అన్నారు. భైంసాలో హిందువులపై దాడులు, నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర మహిళ మోర్చ పిలుపు మేరుకు వికారాబాద్‌ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు సాహు శ్రీలత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తాండూరు పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన రాస్తారోకోలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. పార్టీ నేతలు, మహిళ మోర్చ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భైంసాలో హిందూవులపై వరుస దాడులు జరుగుతున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంత్రించడం విఫలమయ్యిందన్నారు. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యా ఘటనలో బాధితులు, నిందితులు వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓ వర్గానికి మాత్రమే మద్దతు ఇస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర మహిళ కమీషన్‌ చైర్‌ఒపర్సన్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. భైంసా అల్లర్లకు కారకులైన వారిని శిక్షించడంతో కావాలనే అలసత్వం చేస్తుందన్నారు. ఓ వర్గానికి కొమ్ము కాస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భైంసాలో ధృష్టరాత్ర వైఖరితో రాక్షస పాలన చేస్తోందన్నారు. భైంసా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ, బీజేపీ మహిళ మోర్చ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధితులకు చేయకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను చెదరగొట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్‌, మహిళ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంతారం లలిత, కౌన్సిలర్లు బంటారం లావణ్య, బాలప్ప, వికారాబాద్‌ కౌన్సిలర్‌ శ్రీదేవి సదానందా, బీజేపీ నాయకులు పూజారి పాండు, సుదర్శన్‌గౌడ్‌, రజనీకాంత్‌, తాండ్ర నరేష్‌, బీరప్ప, మల్లేశ్‌యాదవ్‌, దోమ కృష్ణ, మహిళ నాయకురాళ్లు లగిషెట్టి సంధ్య, మోమిన్‌పేట్‌ మండల అధ్యక్షురాలు విమల, సరిత, లావణ్య, మాధవి, లావణ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement