Thursday, May 9, 2024

Breking: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. అమీర్‌పేట‌, కూకట్ పల్లి, హైదర్ నగర్, కేపీహెచ్ బి కాలనీ, మాదాపూర్‌, మోతినగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, బోరబండ, రహమత్ నగర్, యూసఫ్ గూడ, జూబ్లీహీల్స్ చెక్ పోస్ట్, జూబ్లీహిల్స్, మదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డికపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షం కుమ్మేస్తోంది.

వర్షం వల్ల రోడ్లపై భారీగా నీరు నిలిచింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్కూళ్లు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షసూచన ఉండడంతో పలు ప్రాంతాలకు వెళ్లే వారు మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement