Tuesday, May 14, 2024

Review Meeting – ఎమ్మెల్యేల‌తో కెటిఆర్ భేటి…ఓట‌మిపై స‌మీక్ష‌…

హైద‌రాబాద్ – ఓట‌మి కార‌ణాల‌పై బిఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు.. ఈ ఎన్నిక‌ల‌లో గెలిచిన‌, ముఖ్య‌నేత‌ల‌తో తెలంగాణ భ‌వ‌న్ లో నేడు స‌మావేశ‌మయ్యారు..ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ క‌విత కూడా హాజ‌ర‌య్యారు.. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్య నేత‌లు ఈ మీడింగ్ కు హాజ‌రై ఓట‌మి కారణాల‌ను కెటిఆర్ కు వివ‌రించారు..అలాగే ఓడిపోయిన నియోజకవర్గాల్లోని పరిస్థితును సమీక్షించారు. భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై కూడా నేత‌ల‌తో కెటిఆర్ సుదీర్గంగా చర్చించారు..అనంత‌రం ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అందరూ కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement